అర్హత లేకున్న ప్రేమించావు – Idi Kevalam Nee Krupaye Telugu Christian Song Lyrics | Arhata Lekunna Preminchavu Song

అర్హత లేకున్న ప్రేమించావు – Idi Kevalam Nee Krupaye Telugu Christian Song Lyrics

పల్లవి :

అర్హత లేకున్న ప్రేమించావు

ఇది కేవలం నీ కృపయే

యోగ్యత లేకున్న హెచ్చించావు

ఇది కేవలం నీ కృపయే

అనుపల్లవి :

కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే

కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే

1.

లోకము నన్ను ఆకర్షింపగా

అల్లరితనము నా చుట్టుచేరగా

ఓటమి నా బ్రతుకును హేళన చేయగా

నీ కృపతో నన్ను బలపరచితివే

ఇంతగా నన్ను హెచ్చించుటకు

ఏ పాటివాడను యేసయ్య

నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను

2.

శ్రమలు శోదనలు నన్నావరింపగా

అజ్ఞానముచే నే హీనమవ్వగా

మరణపు కొరలు నా చుట్టు చేరగా

నీ కృపతో నన్ను బ్రతికించితివే

ఇంతగా నన్ను ప్రేమించుటకు

ఏ పాటివాడను యేసయ్య

నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను

Comments