సిలువలో వ్రేలాడే నీ కొరకే | Siluvalo vrelade ni korake | Telugu Christian Lent Song Lyrics | Download

Siluvalo vrelade ni korake | సిలువలో వ్రేలాడే నీ కొరకే | Telugu Christian Lent Song Lyrics

సిలువలో వ్రేలాడే నీ కొరకే     

    సిలువలో వ్రేలాడే నీ కొరకే 

    సిలువలో వ్రేలాడే... 

    యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము... 

    యేసు నిన్ను పిలచుచుండే... 


1. కల్వరి శ్రమలన్ని నీ కొరకే 

    ఘోర సిలువ మోసి కృంగుచునే ||2|| 

    గాయములచే బాధనొంది 

    రక్తము కార్చి హింసనొంది ||2|| ||సిలువలో|| 

2. నాలుక యెండెను దప్పి గొని 

    కేకలు వేసెను దాహమని ||2||

    చేదురసమును పానము చేసి చేసెను జీవయాగమును ||2|| ||సిలువలో|| 

3. అగాధ సముద్ర జలములైనా 

    ఈ ప్రేమను ఆర్పజాలవుగా ||2|| 

    ఈ ప్రేమ నీకై విలపించుచూ 

    ప్రాణము ధార బోయుచునే ||2|| ||సిలువలో||