వనములోనికి పోయెను | Vanamuloniki Poyenu | Telugu Christian Song Lyrics | Download
వనములోనికి పోయెను - నా రక్షకుండహ
వనములోనికి పోయెను - నా రక్షకుండహ (2)
ప్రేమానుభవ దీక్షతో - నా ప్రభువు పోయెను (2)
ఒలీవ లాయనన్ జూచెను - ఎండాకులు దయను జూపెను (2)
వృక్షంబుల్ కూడ రమ్మనెన్ - నా ప్రభువు పోవగా (2)
||వనము||
1. అడవినుండి వచ్చెను - సంతుష్టి నొందుచు (2)
చావావమాన మొందను - సంతుష్టి నొందెను (2)
చావున్ సిగ్గున్ నా ప్రభువును - ఆ చెట్ల నీడనుండి లాగెను (2)
కడకొక్క మ్రాను మీదనే - నా ప్రభుని చంపిరి (2)
||వనము||
2. నా హృదయంబులోనికి - నా ప్రభువా రమ్మయా
నీ మ్రాను మోసెదన్ ప్రభో - రక్తంబు తుడిచెదన్ (2)
నీ రక్తమే నా యాత్మకెంతో - హాయిని జీవము నిచ్చును (2)
నా యాత్మన్ నీ కర్పంతును - నా ప్రభువా రమ్మయా
||వనము||