ఈ దేహమే దేవుని ఆలయం | I Dehame Devuni alayam | Telugu Christian Song Lyrics | Download
ఈ దేహమే దేవుని ఆలయం - పరిశుద్ధ పరచుము దేవా
మహిమగల సంఘముగా - సిద్ధపడిన వధువుగా
నీ ఎదుట నిలుచుటకు శక్తినీయమా !
మహిమగల సంఘముగా - సిద్ధపడిన వధువుగా
నీ ఎదుట నిలుచుటకు కృపనీయుమా !
1. పాపములో పుట్టిన నన్ను - నీవు ఏర్పరచినావు
ఈ పాపి కోసం మహిమను విడచి - భువికి ఏతెంచావు
సిలువలో ప్రాణం పెట్టావు - రక్షణ భాగ్యము నాకిచ్చావు
దయాదాక్షిణ్యములతో నన్ను - ప్రధానము చేసికొన్నావు
2. శాశ్వతమైన నీ ప్రేమను - నాపై చూపించావు
సుందరుడా అతిమనోహరుడవై - నీ ప్రేమను నాపై ధ్వజముగా నిలిపావు
నీవు నా ప్రియుడావు - నీపైనే ఆనుకొందును
నీ రాకతో నా జీవితం - పరిపూర్ణత చెందును