Intakalam nidu krupalo | ఇంతకాలం నీదు కృపలో | Telugu Christian Song Lyrics | Download

Intakalam nidu krupalo | ఇంతకాలం నీదు కృపలో | Telugu Christian Song Lyrics

ఇంతకాలం నీదు కృపలో

    ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా (2) 
    ఇకను కూడా మాకు తోడు నీడ నీవేగదా (2) || ఇంతకాలం || 

1. ఎన్ని ఏళ్ళు గడచినా... ఎన్ని తరాలు మారినా...  
(2)
    మారని వీడని ప్రేమే నీదయ్యా 
    మార్చినా నాజీవితం నీకే యేసయ్యా "2"|| ఇంతకాలం || 

2. నీవుచేసిన మేలులు తలంచు కొందును అనుదినం (2) 
    నాస్తుతి స్తోత్రముల్ నీకే యేసయ్యా 
    వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా "2"|| ఇంతకాలం || 

3. దూరమైతిరి ఆప్తులు విడచి పోతిరి నాహితులు (2)
    సోధన వేధన తీర్చిన యేసయ్యా 
    తల్లిలా తండ్రిల కాచిన యేసయ్యా "2" || ఇంతకాలం ||