కళ్యాణం కమనీయం | Kalyanam Kamaniyam | Telugu Christian Wedding Song Lyrics | Download
కళ్యాణం కమనీయం
కళ్యాణం కమనీయం – ఈ సమయం అతి మధురం (2)
దేవా రావయ్యా – నీ దీవెన లీవయ్యా… (2) ( కళ్యాణం కమనీయం )
1. ఏదేను వనమున యెహూవా దేవా – మొదటి వివాహము చేసితివి (2)
ఈ శుభదినమున నవదంపతులను (2)
నీ దీవెనలతో నింపుమయా.. ( దేవా రావయ్యా )
2. కానా విందులో అక్కరనెరిగి – నీళ్ళను రసముగా మార్చితివే (2)
కష్టాలలో నీవు అండగా ఉండి (2)
కొరతలు దీర్చి నడుపుమయా.. ( దేవా రావయ్యా )
3. బుద్ధియు జ్ణానము సంపదలన్నియు – గుప్తమైయున్నవి నీ యందే (2)
ఇహపర సుఖములు మెండుగా నొసగి (2)
ఇల వర్థిల్లగ చేయుమయా ( దేవా రావయ్యా )