ఇమ్మానుయేలు రక్తము | Emmanuyelu Rakthamu | Telugu Christian Song Lyrics | Download
ఇమ్మానుయేలు రక్తము
ఇమ్మానుయేలు రక్తము
ఇంపైన యూటగు
ఓ పాపి! యందు మున్గుము
పాపంబు పోవును
1. యేసుండు నాకు మారుగా
ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్త మెప్పుడు
స్రవించు నాకుగా
2. ఆ యూట మున్గి దొంగయు
హా! శుద్ధు-డాయెను
నేనట్టి పాపి నిప్పుడు
నేనందు మున్గుదు
3. నీ యొక్క పాప మట్టిదే
నిర్మూల మౌటకు
రక్షించు గొర్రె పిల్ల? నీ
రక్తంబే చాలును
4. నా నాదు రక్తమందున
నే నమ్మి యుండినన్
నా దేవుని నిండు ప్రేమ
నే నిందు జూచెదన్
5. నా ఆయుష్కాల మంతటా
నా సంతసం-బిదే
నా క్రీస్తు యొక్క రొమ్మునన్
నా గాన-మిద్దియే