ఎందుకో నన్నింతగా నీవు | Endhuko Nanninthaga | Telugu Christian Song Lyrics | Download

ఎందుకో నన్నింతగా నీవు | Endhuko Nanninthaga | Telugu Christian Song Lyrics | Download

ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా

    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా 

    అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2) 


1. నా పాపము బాప నరరూపివైనావు 

    నా శాపము మాప నలిగి వ్రేలాడితివి 

    నాకు చాలిన దేవుడవు నీవే 

    నా స్థానములో నీవే (2)         ||ఎందుకో|| 


2. నీ రూపము నాలో నిర్మించియున్నావు 

    నీ పోలికలోనే నివసించుమన్నావు 

    నీవు నన్ను ఎన్నుకొంటివి 

    నీ కొరకై నీ కృపలో (2)           ||ఎందుకో|| 


3. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు 

    నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు 

    నన్ను నీలో చూచుకున్నావు 

    నను దాచియున్నావు (2)       ||ఎందుకో|| 

4. నీ సన్నిధి నాలో నా సర్వము నీలో 

    నీ సంపద నాలో నా సర్వస్వము నీలో 

    నీవు నేను ఏకమగువరకు 

    నన్ను విడువనంటివే (2)        ||ఎందుకో|| 

5. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే 

    నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే 

    ఏమి అద్భుత ప్రేమ సంకల్పం 

    నేనేమి చెల్లింతున్ (2)             ||ఎందుకో||