మహిమ నీకే ప్రభూ | Mahima Neeke Prabhu | Telugu christian Song Lyrics | Download

Mahima Neeke Prabhu | మహిమ నీకే ప్రభూ | Telugu christian Song Lyrics

మహిమ నీకే ప్రభూ

    మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ (2) 

    స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ (2) 

    ఆరాధనా… ఆరాధనా… (2) 

    ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే ||మహిమ|| 


1. సమీపింపరాని తేజస్సునందు – వసియించు అమరుండవే 

    శ్రీమంతుడవే సర్వాధిపతివే – నీ సర్వము నాకిచ్చితివే (2)       ||ఆరాధనా|| 


2. ఎంతో ప్రేమించి నాకై ఏతించి – ప్రాణము నర్పించితివే 

    విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే (2)       ||ఆరాధనా|| 


3. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివే 

    నీ గుణాతిశయముల్‌ ధరనే ప్రచురింప – ఏర్పర్చుకొంటివే (2)       ||ఆరాధనా||