నీవు నా తోడు ఉన్నావయ్యా | Neevu Naa Thodu Unnaavayyaa | Telugu Christian Song Lyrics | Download
నీవు నా తోడు ఉన్నావయ్యా
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
1. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)
2. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||