సుందరుడా అతిశయుడా | Sundaruda atisayuda | Telugu Christian Song Lyrics | Download
సుందరుడా… అతిశయుడా…
సుందరుడా… అతిశయుడా…
మహోన్నతుడా… నా ప్రియుడా (4)
1. పదివేలలో నీవు అతిసుందరుడవు
నా ప్రాణప్రియుడవు నీవే
షారోను పుష్పమా… లోయలోని పద్మమా…
నిను నేను కనుగొంటినే (2) ||సుందరుడా||
2. నిను చూడాలని
నీ ప్రేమలో ఉండాలని
నేనాశించుచున్నాను (4) ||సుందరుడా||
3. యేసయ్యా నా యేసయ్యా
నీ వంటి వారెవ్వరు
యేసయ్యా నా యేసయ్యా
నీలాగ లేరెవ్వరు (2) ||సుందరుడా||