ఎంత జాలి యేసువా | Entha Jaali Yesuvaa | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,ఎంత జాలి యేసువా,christian telugu songs,christian songs,latest telugu christian songs,telugu christian song,christian telugu america,christian telugu messages,christian telugu nj,christian telugu usa,christian telugu choir,christian worship telugu,new telugu christian songs,telugu christian worship songs,telugu christian paatalu,yentha jaali yesuva,christian telugu,entha jaali yesuvaa,telugu jesus songs

ఎంత జాలి యేసువా

    ఎంత జాలి యేసువా     

    యింతయని యూహించలేను     ||ఎంత|| 


1. హానికరుడ హింసకుడను 

    దేవదూషకుడను నేను (2) 

    అవిశ్వాసినైన నన్ను (2) 

    ఆదరించినావుగా     ||ఎంత|| 


2. రక్షకుండ నాకు బదులు 

    శిక్ష ననుభవించినావు (2) 

    సిలువయందు సొమ్మసిల్లి (2) 

    చావొందితివి నాకై     ||ఎంత|| 


3. ఏమి నీ కర్పించగలను 

    ఏమి లేమి వాడనయ్యా (2) 

    రక్షణంపు పాత్రనెత్తి (2) 

    స్తొత్రమంచు పాడెద     ||ఎంత|| 


4. నీదు నామమునకు యిలలో 

    భయపడెడు వారి కొరకై (2) 

    నాథుడా నీ విచ్చు మేలు (2) 

    ఎంత గొప్పదేసువా     ||ఎంత|| 


5. నేను బ్రతుకు దినములన్ని 

    క్షేమమెల్ల వేళలందు (2) 

    నిశ్చయముగ నీవు నాకు (2) 

    ఇచ్చువాడా ప్రభువా     ||ఎంత|| 


6. నాదు ప్రాణమునకు ప్రభువా 

    సేద దీర్చు వాడ వీవు (2) 

    నాదు కాపరివి నీవు (2) 

    నాకు లేమి లేదుగా     ||ఎంత|| 


7. అందరిలో అతి శ్రేష్ఠుండా 

    అద్వితీయుడగు యేసయ్యా (2) 

   హల్లెలూయ స్తోత్రములను (2) 

    హర్షముతో పాడెద     ||ఎంత||