రండి సువార్త సునాదముతో | Randi Suvaartha Sunaadamutho | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,latest telugu christian songs,randi suvartha telugu christian songs,randi suvaartha sunaadamutho,రండి సువార్త సునాదముతో,christian songs,christian telugu songs,new telugu christian songs,new christian telugu songs,telugu christian songs latest,telugu christian worship songs,christian telugu church,shalem song by randi suvaartha sunaadamutho,latest telugu christian songs lyrics,randi suvaartha sunaadamu tho song.,telugu christian song

రండి సువార్త సునాదముతో

    రండి సువార్త సునాదముతో – రంజిలు సిలువ నినాదముతో 

    తంబుర సితార నాదముతో – ప్రభుయేసు దయానిధి సన్నిధికి 


1. యేసే మానవజాతి వికాసం – యేసే మానవ నీతి విలాసం 

    యేసే పతిత పావన నామం – భాసుర క్రైస్తవ శుభనామం ||రండి|| 


2. యేసే దేవుని ప్రేమ స్వరూపం – యేసే సర్వేశ్వర ప్రతిరూపం 

    యేసే ప్రజాపతి పరమేశం – ఆశ్రిత జనముల సుఖవాసం ||రండి|| 


3. యేసే సిలువను మోసిన దైవం – యేసే ఆత్మల శాశ్వత జీవం 

    యేసే క్షమాపణ అధికారం – దాసుల ప్రార్ధన సహకారం ||రండి|| 


4. యేసే సంఘములో మన కాంతి – యేసే హృదయములో ఘనశాంతి 

    యేసే కుటుంబ జీవన జ్యోతి – పసిపాపల దీవెన మూర్తి  ||రండి|| 


5. యేసే జీవన ముక్తికి మార్గం – యేసే భక్తుల భూతల స్వర్గం 

    యేసే ప్రపంచ శాంతికి సూత్రం – వాసిగ నమ్మిన జనస్తోత్రం ||రండి||