ఇశ్రాయేలీయుల దేవుండే | Iesrayeliyula Devunde | Telugu Christian Song Book Lyrics | Download

telugu christian songs,andhra christian songs telugu,andhra christian telugu old songs,andhra christian hymns telugu songs,telugu jesus songs,andhra christava keerthanalu telugu songs,andhra christava keerthanalu telugu songs jukebox,andhra christian songs jukebox,andhra kraistava keertanalu telugu,latest telugu christian songs,andhra kraisthava keerthanalu songs,christian songs,telugu christian song,jesus telugu songs,jesus songs telugu

ఇశ్రాయేలీయుల దేవుండే

ఇశ్రాయేలీయుల దేవుండే – యెంతో స్తుతి నొందును గాక = యాశ్రితువౌ తన జనులకు దర్శన – మాత్మ విమోచన కలిగించె ॥నిశ్రా॥ 


తన దాసుఁడు దావీదు గృహంబున – ఘన రక్షణ శృంగము నిచ్చె = మన శత్రువు లగు ద్వేషులనుండియు – మనలన్ బాపి రక్షణ నిచ్చె ॥నిశ్రా॥ 


దీనిని గూర్చి ప్రవక్తల నోట – దేవుఁడు పలికించెను దొల్లి = మానవ మన పితరులఁ గరుణింపఁగ – మహిలోన నిబంధనఁ జేసె ॥నిశ్రా॥ 


జనకుం దగు నబ్రాహాముతోఁ – జేసిన యా ప్రమాణముఁ దలఁచి = మనము విరోధులనుండి విమోచన – గని నిర్భయులమై మెలఁగ ॥నిశ్రా॥ 


ఆయన సన్నిధానమునందు – నతి శుద్ధిగ నీతిగ నుండఁ = పాయక తన సేవను నిత్యంబును – జేయఁగ నీ రక్షణ నిచ్చె ॥నిశ్రా॥ 


ధర నో శిశువా దేవుని దీర్ఘ – దర్శి వనెడు పేరొందెదవు = పరమేశ్వరుని వాత్సల్యతతోఁ = పాపవిముక్తిఁ బ్రజ లొంద ॥నిశ్రా॥ 


మానుగ రక్షణ జ్ఞాన మొసంగఁగ – మార్గము సిద్ధపరచుటకై – దీన మనస్సుతోఁ బ్రభునకు ముందు – గా నడిచెదవు భయభక్తి ॥నిశ్రా॥ 


మరియును సమాధాన సరణిలో – మన మిఁక నడువఁ జీఁకటిలో = మరణచ్ఛాయలో నుండిన వారికి – నరుణోదయ దర్శన మిచ్చె ॥నిశ్రా॥ 


జనక పుత్రాత్మ దేవుని కిలలో – ఘనత మహిమ కల్గును గాక = మును పిపు డెప్పుడు తనరి నట్లు యుగ – ములకును దనరారునుగా కామేన్  ॥నిశ్రా॥