మా యేసు క్రీస్తు నీవే | Maa Yesu Kreesthu Neev | Telugu Christian Song Lyrics | Andhra Kristhava Keerthanalu | Download

మా యేసు క్రీస్తు నీవే,Maa Yesu Kreesthu Neeve,bekind,christian songs,christian songs 2020,christian music,gospel music,worship,new christian,jesus,christian song,jesus songs,god songs,jesus music,telugu jesus songs,christian,jesus telugu songs,latest telugu christian songs,jesus songs in telugu,telugu christian songs,new songs,christmas songs,famous christian songs,jesus songs telugu,best christian songs,2022,hosanna ministries

మా యేసు క్రీస్తు నీవే

మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవు నీవే తండ్రికి నిత్యకుమారుడవు ఓ క్రీస్తూ|| 

భూనరులన్ రక్షింప బూనుకొనినప్పుడు దీన కన్యాగర్భమున్ దిరస్కరింపలేదుగా ఓ క్రీస్తూ||

విజయము మరణపు వేదనపై నొందగా విశ్వాసులందరికిన్ విప్పితివి మోక్షమున్ ఓ క్రీస్తూ|| 

నీవు తండ్రిదైనట్టి నిత్య మహిమయందు దేవుని కుడివైపుఁ దిరముగాఁ గూర్చున్నావు ఓ క్రీస్తూ|| 

నీవు న్యాయాధిపతివై నిశ్చయముగా వఛ్ఛెదవు కావున నీ సాయంబుకానిమ్ము నీ దాసులకు ఓ క్రీస్తూ||

దివ్యమౌ రక్తంబు చిందించి నీవు రక్షించిన సేవకులకై మేముచేయు మనవి నాలించు ఓ క్రీస్తూ|| 

నీ వారి నెల్లప్పుడును నిత్య మహిమయందు నీ పరిశుద్ధులతోను నీ వెంచుకొను మయ్య ఓ క్రీస్తూ|| 

నీదు జనమున్ రక్షించి నీ దాయము దీవించుము నాధా వారలను నేలి లేవనెత్తు మెప్పుడును ఓ క్రీస్తూ|| 

దిన దినమును నిన్ను మహిమ పర్చుచున్నాము ఘనముగా నీ నామమున్ గొప్పచేయుచున్నాము ఓ క్రీస్తూ|| 

నేడు పాపము చేయకుండ నెనరుతో మము గావుమయ్యా పాడెడి నీ దాసులకు బరమ దయ నిమ్మయ్య ఓ క్రీస్తూ|| 

ప్రభువా కరుణించుము ప్రభువా కరుణించుము ప్రార్థించు నీ దాసులపై వ్రాలనిమ్ము దీవెనలన్ ఓ క్రీస్తూ|| 

నిన్ను నమ్మి యున్నాము నీ కృప మాపై జూపుము మేము మోసపోకుండ నీవే కాపాడుమయ్యా ఓ క్రీస్తూ||