యేసు నామము స్మరించు | Yaesu Naamamu Smarimchu | Telugu Christian Song Lyrics | Download
యేసు నామము స్మరించు
1. యేసు నామము స్మరించు
బాధ నీకు గల్గగా
నద్ది క్షేమ సౌఖ్య మిచ్చు
దాని స్మరియించుము
||శ్రేష్ఠమౌ నామము
ఆదరించు నిలను
శ్రేష్ఠమౌ నామము
మోక్షసౌఖ్య మద్దియే||
2. యేసు నామము స్మరించు
శోధనంబు లుండగా
డాలుగాను దాని నెంచి
వేడుమా సునామమున్
3. మమ్ము జేరదీయు యేసు
నామము స్తుతింపగా
మాధుర్యంపు నామ మౌను
ఆత్మ కద్ది తుష్టియే
4. మ్రొక్కుచుందు మేసు నాధ
నీదు పాద పద్మముల్
మోక్షమందుజేరగాను
హెచ్చుగా నుతింతుము