యేసు నీ నామామృతము | Yesu Nee Naamaamruthamu | Telugu Christian Song Lyrics | Download

telugu christian songs,latest telugu christian songs,telugu jesus songs,christian songs,jesus songs telugu,telugu christian songs latest,jesus telugu songs,jesus songs,christian songs telugu,new telugu christian songs,telugu christian hit songs,telugu christian song,christian,latest christian songs telugu,christian music,christian songs 2020,telugu christian,christian video songs,popular christian songs,christian worship songs

యేసు నీ నామామృతము

యేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా (2) దేవ 

మా – దోషములను హరించి మోక్షని 

వాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన           ||యేసు|| 


వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి (2) దేవ 

యెంతో – కీడు జేసిన పాడు వైరిని 

గోడుగో డనంగ వాని – తాడనము జేసితివి          ||యేసు|| 


పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా (2) దేవ 

నీ – దాపు జేరిన వారి కందరి 

కాపదలు బాపి నిత్య కాపుగతి జూపినావు         ||యేసు|| 


అక్షయ కరుణేక్ష భువన – రక్షకా నీవే (2) దేవ 

మమ్ము పక్షముగ రక్షించి మోక్షసు 

రక్షణకు దీక్ష గొని – వీక్షితులమైన మాకు      ||యేసు|| 


అందమగు నీ మందిరమున – బొందుగా మేము (2) దేవ 

నీ – సుందర కరుణామృతము మా 

డెందముల యందు గ్రోలు – టందుకు సుందరమైన        ||యేసు||