మేమిచ్చు కానుకల్ | Maemichchu Kaanukal | Telugu Christian Song Lyrics | Download | Andhra Kristhava Keerthanalu
మేమిచ్చు కానుకల్
1. మేమిచ్చు కానుకల్
నీవే మాకిచ్చితి
మా యాస్తియంత ప్రభువా
నీ దానమే గదా
2. నీ వుచితంబుగా
మా కిచ్చువాడవు
అన్యుల కుచితంబుగా
మేమిచ్చుచుందుము
3. సర్వత్ర బీదలు
అన్నంబునొందరు
కన్నీళ్లు రాల్చు ప్రజలు
అనేకులుందురు
4. ఈలాటివారికి
సహాయమిచ్చుట
దూతలు చేయు సేవకు
సమానమగును
5. పోషించి బీదలన్
రక్షించి పాపులన్
అందరిన్ సంరంక్షించుట
శ్రీ యేసు కార్యమే
6. నా బీదవారికి
నీవిచ్చు దానము
నా కిత్తువను వాక్యము
శ్రీ యేసు చెప్పెను