నమస్కరింప రండి | Namaskarimpa Ramdi | Telugu Jesus Song Lyrics | Christmas Song Lyrics
నమస్కరింప రండి
1. నమస్కరింప రండి - దావీదు పుత్రుని
శ్రీ యేసు రక్షకుండు - ఏతెంచె నేలను
న్యాయంబు లోకమందు - స్థాపించి నిత్యము
అన్యాయమంత దాను - పోగొట్ట వచ్చెను
2. వర్షంబు పడునట్లు - శుష్కించు నేలను
దుఃఖించు వారికెల్ల - హర్షంబు నిచ్చును
శ్రీ యేసు రాజ్యమందు సద్భక్తులందరు
ఖర్జూర వృక్షరీతిన్ వర్థిల్లు చుందురు
3. దిగంత వాసులైన - భూరాజులందరు
శ్రీ యేసు చరణంబుల్ నమస్కరింతురు
భూలోకవాసులైన - జనంబులందరు
క్రీస్తే స్వాధీనమందు జీవింతు రెప్పుడు
4. విరోధులైన వారిన్ - జయింప నెన్నడున్
సింహాసనంబు మీద - నాసీనుడగును
అత్యంత ప్రేమమూర్తి - శ్రీ యేసు ప్రభువు
ఆ దివ్యనామ కీర్తి - వ్యాపించు నీ భువిన్