నీ చిత్తం బేను నీ చిత్తంబే | Nee Chiththm Baenu | Andhra Kristhava Keerthanalu Song Lyrics | Download
నీ చిత్తం బేను నీ చిత్తంబే
1. నీ చిత్తం బేను నీ చిత్తంబే
నేను మట్టిని ఓ కుమ్మరీ!
నీ కోర్కెదీర నన్ దీర్చుమా
నీకు లొంగెదన్ ఓ ప్రభువా
2. నీ మార్గంబేను నీ మార్గంబే
నేడు నన్ను పరిశోధించు
శుద్ధిజేయుమో యేసూ నన్ను
నీ సన్నిధిలో మోకరింతున్
3. నీ కోర్కె యేసు నీ కోర్కెయే
నే గాయంబొంది అలసితిన్
బాగుచేయు నన్ ముట్టిప్రభో
నీకే సమస్త శక్తి నొప్పున్
4. నీ యిష్టంబేను నీ యిష్టంబే
నీ యాత్మతోడ నన్ నింపుమా
నాయందెల్లరు క్రీస్తుంజూడన్
నీ యాధీనంబు నన్నుంచుకో
5. అప్పుడు నేను నీ రీతిగాన్
తప్పకజేతు నో ప్రభువా
ఇప్పుడే నీదు సేవ జేయున్
అప్పగింతు నా సమస్తంబు