సంపూర్ణ జీవము సంపత్తి | Smpoorna Jeevamu Smpaththi | Andhra Kristhava Keerthanalu | Song Lyrics | Download
సంపూర్ణ జీవము సంపత్తి
1. సంపూర్ణ జీవము
సంపత్తి నాకు గాన్
సంతప్త మొందుచు
చావును బొందితి
నీకై చావును బొందితి
నాకేమి చేతువు?
2. నెమ్మయిన రాజ్యము
నీ నొందులాగున
నా నెత్రు కార్చుచు
నా ప్రాణమిచ్చితి
నా ప్రాణమిచ్చి ప్రోచితి
నాకే మిచ్చితివి?
3. నా తండ్రి యింటిని
నా సింహాసనమున్
నా గౌరవంబును
నా వెల్లమానితి
నా వెల్లమానివచ్చితి
నీవే మిచ్చెదవు?
4. చెప్పరాని బాధలన్
పొందుచు సిల్వపై
చిందితి రక్తము
చివ్వున బ్రోవను
చింతల నీకై యోర్చితి
చింతల నోర్తువా?
5. నీ క్షమాపణమున్
రక్షణ మార్గమున్
అక్షయభాగ్యమున్
ఆశించి తెచ్చితిన్
నీకై రక్షణ తెచ్చితిన్
నాకేమి యిత్తువు?