సుక్షేమ శుభకాల విశ్రాంతి | Sukshaema Shubhakaala | Andhra Kristhava Keerthanalu | Telugu Christian Song Lyrics | Download
సుక్షేమ శుభకాల విశ్రాంతి
సుక్షేమ శుభకాల విశ్రాంతి దినమా విచారమెల్ల తీర్చు దైవాదివారమా
ఈనాడు మేము కూడి దేవాలయంబున మా త్ర్యేక దేవ స్తుతిగావింతు మెంతయు
1. నీయందు సృష్టికర్త విశ్రామ మొందెను నీయందు యేసుక్రీస్తు మృత్యు బంధమును
త్రెంచుచు తాను లేచి చావున్ జయించెను నీ యందు పావనాత్మ మాకియ్య బడెను
2. భూవాసు లీ దినంబు సంతోషపడుచు సువార్త విని, పాడి మా యేసు స్తోత్రము
ప్రితృపుత్ర శుద్ధాత్మ త్రిత్వంబౌ దేవుని ఉత్సాహ ధ్వనితోడ నెంతో స్తుతింతురు