దేవ యెహోవా స్తుతి పాత్రుండ | Deva Yehovah Stuti Pathrundu | Bible Mission Song Lyrics Telugu | Christian Song Lyrics Telugu | Download

Deva Yehovah Stuti Pathrundu song lyrics, Deva Yehovah Stuti Pathrundu Telugu song, Bible Mission song lyrics Telugu, Telugu Christian worship songs, Deva Yehovah Bible Mission song, Telugu Christian hymn lyrics, Bible Mission praise and worship songs, Deva Yehovah Stuti Pathrundu lyrics in Telugu, Telugu Christian stotram lyrics, Christian devotional songs Telugu, Bible Mission songs with lyrics, Bible Mission songs Telugu 2024, Telugu Bible hymn lyrics, Telugu Christian praise songs, Bible Mission songs with translation

SONG NO. 08

దేవ యెహోవా స్తుతి పాత్రుండ

దేవ యెహోవా! స్తుతి పాత్రుండ! - పరిశుద్ధాలయ 
పరమ నివాసా!    || దేవ ||


1.
బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత - సర్వము నీవే = 
    సకల ప్రాణులు స్తుతి చెల్లించగ - సర్వద నిను స్తుతు - 
    లొనరించగనున్న    || దేవ ||

2. నీదు పరాక్రమ కార్యములన్నియు - నిరతము నీవే = 
    నీదు ప్రభావ మహాత్యము లన్నియు - నిత్యము 
    పొగడగ నిరతము స్తోత్రములే    || దేవ ||

3. స్వర మండల సితారలతోను - బూరల ధ్వనితో = 
    తంబురలతో నాట్యము లాడుచు - నిను 
    స్తుతియించుచు - స్తోత్రము జేసెదము    || దేవ ||

4. తంతి వాద్య పిల్లన గ్రోవి - మ్రోగెడు తాళము = గంభీర 
    ధ్వని గల తాళములతో - ఘనుడగు దేవుని కీర్తించను 
    రారే    || దేవ ||

5. పరమాకాశపు దూతల సేనలు - పొగడగ మీరు = 
    ప్రేమమయుని స్తోత్రము చేయగ - పరమానందుని - 
    వేగస్మరించను రారే    || దేవ ||

6. సూర్య చంద్ర నక్షత్రంబు - గోళములారా! = 
    పర్వతమున్నగు వృక్షములారా! - పశువులారా! - 
    ప్రణుతించను రారే    || దేవ ||

7. అగ్నియు మంచును సముద్ర ద్వీప - కల్పము లారా = 
    హిమమా వాయువు తుఫానులారా! - మేఘములారా! 
    మహిమ పరచ రారే    || దేవ ||

8. సకల జల చర సర్వ - సమూహములారా! = ఓ 
    ప్రజలారా! భూపతులారా! - మహనీయుండగు - 
    దేవుని స్తుతి చేయన్    || దేవ ||