దేవా మేము నమ్మదగిన | Devaa Memu nammadagina | Telugu Christian Song Lyrics | Bible Mission Songs | Download

Deva Memu Nammadagina, Telugu Christian song lyrics, Christian worship songs, Jesus songs in Telugu, Telugu gospel music, Bible Mission songs, Christian devotional songs, Telugu praise songs, Deva Memu Nammadagina lyrics, faith-based Telugu songs, Telugu spiritual songs, Telugu Jesus songs, Christian faith songs in Telugu, Telugu church songs

SONG NO. 15

దేవా మేము నమ్మదగిన

దేవా! మేము నమ్మదగిన వారమా - సృష్టి కర్తా! నరుల 

హృదయము - నందు నీకు స్తోత్ర గీతము    || దేవా మేము ||


1. నాలోని అవిశ్వాసము పో - గొట్టు దేవుడవు =

    నా సందేహమును - అణచునట్టి దేవుడవు || దేవా మేము ||

2. నాలోపుట్టు సంశయము మా - న్పించు దేవుడవు =

    అపనమ్మికను నిర్మూల - పరచునట్టి కర్తవు    || దేవా మేము ||

3. అనుమానము లేకుండా - జేయు ఆత్మవు =

    వెనుకాడు గుణము బెరికి - వేయు విజయశాలివి    || దేవా మేము ||

4. నీ ప్రేమను నమ్మని నైజము - కూల్చు తండ్రివి =

    నీ శక్తిని నమ్మని బుద్ధిని పరిమార్చు ప - రాక్రమ శాలివి || దేవా మేము ||

5. అవిశ్వాసపు సంగతులు - దహించు అగ్నివి =

    అవి నాలోనుండి తీసివేయు వి - శ్వాస పాత్రుడవు    || దేవా మేము ||

6. క్రీస్తునుబట్టి ఈ మేలు - చేయు దేవా! =

    నా హృదయము నిండ ఉన్న స్తుతులు - అంగీకరించుము

                                                                                           || దేవా మేము ||

7. తండ్రికిని కుమారునికిని - పరిశుద్ధ ఆత్మకున్ =

    యుగ యుగముల వరకు మహిమ - కలుగును గాక      || దేవా మేము ||