ఆ నింగిలోని చుక్క | AA NINGILONA CHUKKA | Christmas Song Lyrics Telugu | Download jesus Song Lyrics Telugu
నింగిలోని చుక్క
నింగిలోని చుక్క తెచ్చెను నేడు ఎంతో సంతోషము
నింగిలోని దూత తెచ్చెను నేడు గొప్ప శుభవార్తను (2)
దావీదు కుమారుడు లోకాన్ని ఏలే రాజు
పశువుల పాకలో జన్మించే మహారాజు (2) ||ఆ నింగిలోన||
1. పాపపు బ్రతుకులను మార్చుటకు
లోకములో జన్మించే ఆ దేవుడు
నశించే ఆత్మలను రక్షించుటకు
రా రాజుగా జన్మించెను(2)
ఎన్నడు విడువడు
ఎన్నడు ఎడబాయడు
ఎన్నడు విడువడు
నిన్ను ఎన్నడూ ఎడబాయడు
"దావీదు కుమారుడు"2
2. రోగులకు స్వస్థత నిచ్చుట కు
ఇమ్మానుయేలు గా దిగివచ్చాడు
తన ప్రజల భుజములపై భారమును
తొలగించుటకు జన్మించెను(2)
నిజమైన దేవుడని ప్రతి నాలుక ఒప్పుకొను
నిజమైన దేవుడని ప్రతి మోకాలు వంగును
"దావీదు కుమారుడు"2
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్