అంబరాన వెలిసెను తార | Ambarana Velisenu Taara | Jesus Christmas Song Lyrics Telugu | Latest Christmas Song Lyrics Telugu | Download
అంబరాన వెలిసెను తార
అంబరాన వెలిసెను తార
సంబరాలు చేయగ రండి
మానవాళి రక్షణ కొరకు
మహరాజే ఇల పుట్టెను
ప్రేమే క్రిస్మస్ - ఆరాధనే క్రిస్మస్
నిరీక్షణే క్రిస్మస్ నిత్యజీవమే క్రిస్మస్
వాక్యమే శరీరధారిగ మనకై వచ్చెను
మంటిదేహమును మహిమగ మార్చుటకు
విశ్వసించిన విజయము కలుగును
నిత్యజీవానికి మనలను చేర్చును
లేఖనాలు నెరవేర్చుటకు భువికే వచ్చెను
వాగ్దానములు పరిపూర్ణము చేయుటకు
సర్వలోకానికి సువార్త ప్రకటించుటకు
పరలోక స్వాస్థ్యము అనుగ్రహించుటకు
రోగులను స్వస్థ పరచుటకు చెంతకు చేరెను
మరణపుభీతిని పారద్రోలుటకు
అపవాది క్రియలను అణచివేయుటకు
పరిశుద్దాత్మతో అభిషేంచుటకు