క్రిస్మస్ సంతోషగానాలతో | Kristhmas Santhoshaganalatho | Telugu Christian Christmas Song Lyrics | Jesus Christmas Song Lyrics Telugu | Download
క్రిస్మస్ సంతోషగానాలతో
మహిమ గల పరలోకము నుండి - దిగివచ్చిన దివ్య తేజుడా
రారాజు ధరణి పైకి - దయచేసినా ధవళవర్ణుడా
{{ క్రిస్మస్ సంతోషగానాలతో - యేసయ్య నే చెరుచూ
క్రిస్మస్ మనసార యేసయ్య కు - ఆరాధన చేసేద్దాం }}
|| మహిమ ||
1. పరిశుద్ధుడు పరిపూర్ణుడు - లోకములో లేని నిజదేవుడు (2)
దీనుడై భూమిపైకి దిగివచ్చేను - పశువుల పాకలో పవళించెను (2)
{{ క్రిస్మస్ }}
2. రక్షణ వెలుగు సువార్తను - పాపికి కలుగు శుభవార్తను (2)
పరలోక దూతలు ప్రకటించెను - ప్రభువైన యేసును చూపించెను (2)
{{ క్రిస్మస్ }}
3. ప్రేమను పంచే ప్రేమామయుడు - శాపము బాపే శక్తిమంతుడు (2)
బెత్లహేము పురము నందు ఉదయించెను - గొల్లలు జ్ఞానుల సుతియించెను (2)
{{ క్రిస్మస్ }}