క్రిస్మస్ సంతోషం | Kristhmas Santhosham | Telugu Christmas Song Lyrics | Jesus Song Lyrics Telugu | Joshua Gariki | Download
క్రిస్మస్ సంతోషం
క్రిస్మస్ సంతోషం నా గుండె నిండెను
క్రిస్మస్ తరాలతో నా ఇల్లు నిండెను (2)
ఊరు వాడంతా - 3 సంబరాలు చేయగా
రారాజు రాకను లోకమంతా చాటెదాం
రండోయ్ రారండోయ్ రక్షకుడు పుట్టెను
రండోయ్ రారండోయ్ జగమంతా
చాటిదాం (క్రిస్మస్)
1. తూర్పు దిక్కు నుండి చుక్క పుట్టెను
లోకరక్షకుని జాడ తెలిపెను
తూర్పు దిక్కున చుక్కను చూసెను
జ్ఞానులంతా కలిసి యేసుని చేరెను *2
తూర్పు దిక్కు నుండి దూత వెళ్లెను
లోకమంతా క్రీస్తు వార్త తెలిపెను
తూర్పు దిక్కున గొల్లలంతా చేరెను
రారాజు పుట్టెనని లోకానికి చాటెను (ఊరు)
2. రాజుల రాజుగా యేసు పుట్టెను
లోక పాపమంతా తుడిచి వేసెను
రాజుల రాజుగా క్రీస్తు పుట్టెను
లోకమంతటికి రక్షణ తెచ్చెను *2
రాజుల రాజు మాట పలికెను
బంధకాల నుండి విడుదల కలిగిను
రాజుల రాజు ప్రేమ చూపెను
దిక్కులేని వారికి దారి చూపెను (ఊరు)