ఆశ్రయుడా నా యేసయ్యా | Asrayuda Na Yesayya | Hosanna Ministries Song Lyrics 2025 | Download
ఆశ్రయుడా నా యేసయ్యా
ఆశ్రయుడా నా యేసయ్యా
స్తుతి మహిమ ప్రభావము నీకేనయా
విశ్వవిజేతవు - సత్యవిధాతవు
నిత్యమహిమకు - ఆధారము నీవు
లోక సాగరాన క్రుంగినవేళ
నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి - నను చేరదీసిన నిర్మలుడా
నీకేనయా ఆరాధన - నీకేనయా స్తుతి ఆరాధన
తెల్లని వెన్నెల కాంతివి నీవు
చల్లని మమతల మనస్సే నీవు
కరుణనుచూపి కలుషము బాపి
నను ప్రేమించిన ప్రేమవు నీవు
జనులకు దైవం - జగతికి దీపం
నీవుగాక ఎవరున్నారు
నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహరాజువు
జీవిత దినములు అధికములగునని
వాగ్దానము చేసి దీవించితివి
ఆపత్కాలమున అండగనిలిచి
ఆశలజాడలు చూపించితివి
శ్రీమంతుడవై సిరికేరాజువై
వెతలనుబాసి నాస్థితి మార్చితివి
అనురాగమే నీ ఐశ్వర్యమా సాత్వికమే నీ సౌందర్యమా
నీచిత్తముకై అరుణోదయమున
అర్పించెదను నా స్తుతి అర్పణ
పరిశుద్ధులలో నీ స్వాస్థ్యముయొక్క
మహిమైశ్వర్యము నే పొందుటకు
ప్రతి విషయములో స్తుతి చెల్లించుచు
పరిశుద్ధాత్మలో ప్రార్థించెదను
పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా