జగములనేలే పరిపాలక | Jagamulanele Paripalaka | Telugu Hosanna Ministries Song Lyrics New 2025 | Download
జగములనేలే పరిపాలక
జగములనేలే పరిపాలక
జగతికి నీవే ఆధారమ
ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము
పాడెద నిరతము ప్రేమగీతము
యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్య
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్య
మహరాజుగా నా తోడువై నిలిచావు ప్రతిస్థలమున
నా భారము నీవు మోయగా సుళువాయే నా పయనము
నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నను వీడదే
నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే
సుకుమారుడా నీ చరితము నేనెంతవివరింతును
నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను
ఘనులకు లేదే ఈ శుభతరుణం నాకిది నీ భాగ్యమా
జీవితమంతా నీకర్పించి నీ రుణము తీర్చనా
పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే
నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే
నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా
నా ప్రతిక్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెద