కురిసింది తొలకరి వాన | Kurisindi Tolakari Vana | Hosanna Ministries New Song Lyrics 2025 | Song No 6 | Download
కురిసింది తొలకరి వాన
కురిసింది తొలకరి వాన నా గుండెలోన
చిరుజల్లులా ఉపదేశమై - నీ వాక్యమే వర్షమై
నీ నిత్య కృపయే వాత్సల్యమై
- నీ దయయే హెర్మోను మంచువలె...
పొంగి పొరలి ప్రవహించె నా జీవితాన
ఆనందించి ఆరాధించెద - నా యేసయ్య
ధూళినై పాడైన ఎడారిగ ననుచేయక
జీవజల ఊటలు ప్రవహింపచేశావు...
కలతల కన్నీళ్లలో కనుమరుగై పోనీయక
సాక్షి మేఘమై నిరీక్షణగ నిలిచావు...
స్తుతులు స్తోత్రం నీకేనయ్య దయాసాగరా
నీ మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధిచేసి
నా చీలమండలమునకు సౌందర్యం ఇచ్చితివి...
నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక
నీ ప్రభావ మేఘముతో సాక్షిగ నను నడిపితివి...
తడిసి మునిగి తేలెదనయ్య ప్రేమసాగరా
నా తొలకరి వర్షము నీవై చిగురింప చేసావు
నా ఆశల ఊహలలో విహరింప చేసావు...
నా కడవరి వర్షము నీవై ఫలియింప చేసావు
నీ మహిమ మేఘములో నను కొనిపోయెదవు...
హర్షధ్వనులతో హర్షించెదను కరుణాసాగరా