Emaina Cheyagalavu Katha Mottham | ఏమైనా చేయగలవు కథ మొత్తం | Telugu Christian Song Lyrics
ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు | Emaina Cheyagalavu – Katha Mottham Marchagalavu | Telugu Christian Song Lyrics | Latest Song Lyrics
ఏమైనా చేయగలవు
స్థిరపరచువాడవు బలపరచువాడవు
పడిపోయిన చోటే నిలబట్టువాడవు
ఘనపరచువాడవు హెచ్చించువాడవు
మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు
ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు
నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు
యేసయ్య యేసయ్య నీకే నీకే సాధ్యము
సర్వకృపానిధి మా పరమ కుమ్మరి
నీ చేతిలోనే మా జీవమున్నది
మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి
మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి
నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా?
నీ కంచే దాటగ శత్రువుకు సాధ్యమా?
మా దేవా నీవే మాతొడుంటే అంతే చాలును
అపవాది తలచిన కీడులన్నీ, మేలైపోవును

Comments
Post a Comment