నజరేతు పట్నాన నాగు మలే | Nazarethu Patnaana Naagu Male | Telugu Christian Christmas Song Lyrics | Christmas Song Lyrics Telugu | Download
నజరేతు పట్నాన నాగు మలే
నజరేతు పట్నాన నాగు మలే దారిలో
యోసేపు మరియమ్మ నాగమలె దారిలో - (2)
హల్లేలూయా - (4) - (2)
మేము వెళ్లి చూచినాము స్వామియేసు నాధుని - (2)
ప్రేమ మొక్కి వచ్చినాము మామనంబు లలరగ - (2)
బేతలేము పురములోన బీద కన్య మరియకు - (2)
పేదగా సురూపు దాల్చి వెలిసే పసుల పాకలో - (2)
పేదావడ్ల వారి కన్య మరియమ్మ
ప్రేమ గల యేసు తల్లి - మరియమ్మ
ప్రేమ గల యేసు తల్లి - (2)
పేరెళ్లిన దేవ దేవుడే - యేసయ్య
ప్రేమ గలయవతారం - (2)
స్వర్గ ద్వారాలు తెరచిరి - యేసయ్య
స్వర్గారాజు పుట్టగానే - యేసయ్య
స్వర్గారాజు పుట్టగానే - (2)
పరుగున దూతల్ వచ్చీరి -
యేసయ్య చక్కాని పాటల్ పాడీరి - (2)
నువ్వు పోయే దారిలో యెరూషలేము గుడి కాడ - (2)
అచ్చం మల్లెపూల తోట ఏసయ్య
అచ్చం మల్లెపూల తోట ఏసయ్య
దొడ్డు దొడ్డు బైబిల్లు
దోసిట్లో పెట్టుకుని - (2)
దొరోల్లే బయలెల్లినారో యేసయ్య
బయలెల్లినారో యేసయ్య - (2)
రాజులకు రాజు బుట్టెన్నయ్య - (2)
రారే చూడా మనమెల్లుదాం అన్నయ్య - (2)
తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య - (2)
తరలినారే వారు బెత్లహేమన్నయ్య - (2)
పదరా పోదామురన్న శ్రీ యేసుని చూడ
పదరా పోదామురన్న - (2)
శ్రీ ఏసన్న నట - లోక రక్షాకుడట - (2)
లోకులందరికయ్యో - ఏక రక్షాకుడట - (2)
పదరా హే పదరా హే పదరా
పోదామురన్న శ్రీ యేసుని చూడ
పదరా పోదామురన్న - (2)