Srusti kartha dhevudu | సృష్టికర్త దేవుడు మనకై ఇల సృష్టిగా | Christmas Song Lyrics Telugu Download

Srusti kartha dhevudu | సృష్టికర్త దేవుడు మనకై ఇల సృష్టిగా | Christmas Song Lyrics Telugu Download telugu christian songs lyrics,jesus songs lyrics in telugu

సృష్టికర్త దేవుడు మనకై ఇల సృష్టిగా

సృష్టికర్త దేవుడు మనకై ఇల సృష్టిగా మారెను నిన్ను నన్ను హెచ్చింపను నిన్ను నన్ను రక్షింపను ||2||

మహోన్నత దేవుడు ఇల మనిషిగా మనకై ఏతెంచెను ||2||

నిన్ను నన్ను హెచ్చింపను నిన్ను నన్ను రక్షింపను ||2||

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రీ క్రిస్మస్ ||4||

1. పశుల తొట్టిలో పవళించి తగ్గింపు నేర్పించెను ఆప్యాయత అనురాగము మనలోన ఉంచెను ||2||

ఔన్నత్యమే మనకివ్వగా లోకాన ఏతెంచెను

తన ఔన్నత్యమే మనకివ్వగా లోకాన ఏతెంచెను

ఈ భువికి అరుదెంచెను

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రీ క్రిస్మస్ ||4|| ||సృష్టికర్త||

2. మన శ్రమలను తప్పించను శరీరముతో జనియించెను పులకింపను మన హృదయములు బాలునిగా వచ్చెను ||2||

పరిశుద్ధత మనకివ్వగా లోకాన ఏతెంచెను

తన పరిశుద్ధత మనకివ్వగా లోకాన ఏతెంచెను

ఈ భువికి అరుదెంచెను

హ్యపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రీ క్రిస్మస్ ||4|| ||సృష్టికర్త||

Srusti kartha dhevudu telugu christian song lyrics Video :-