వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే | Vacce vacce krismas vacce Telugu Christmas song Lyrics | Sandhadi 5
వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే
Balle Balle Yeshu Teri Balle
ఓరన్నా నీకు తెలుసా
ఎవరో ఈ ప్రభు యేసు
నీకు తెలుసా ఓరమ్మో
ఎవరో ఈ చిన్ని యేసు
అతి సుందరుడు
అతి కంక్షనీయుడు
అతి మనోహరుడు
అతి పరిశుద్ధుడు
మనవతారం ఎత్తినోడు
మనకోసం పుట్టినోడు
Chorus:
వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే
తెచ్చే తెచ్చే సందడి తెచ్చే
వచ్చే వచ్చే పండుగ వచ్చే
తెచ్చే తెచ్చే సందడి తెచ్చే
లోక రక్షకుడు మనకై వచ్చే
మనకోసం రక్షణ తెచ్చే
పండుగ వచ్చే
సందడి తెచ్చే
రక్షకుడోచ్చే
రక్షణ తెచ్చే
నీకు తెలుసా ఓరన్నా?? ఎవరో ఈ ప్రభు యేసు
Verse: 1
మూగోనికి మాటిచ్చినోడు
గుడ్డోనికి చూపిచ్చినోడు ((2))
ఈ చిన్ని బాలుడు లోకాన్ని సృష్టించినోడు
ఈ చిన్ని బాలుడు లోకాన్ని ఏలేటోడు ((వచ్చే వచ్చే క్రిస్మస్))
Verse:2
కుంటోనికి నడకిచ్చినోడు
నీటి మీద నడిచేటోడు ((2))
ఒక్క మాటతోనే సముద్రాన్ని ఆపేటోడు
దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నోడు ఈ యేసు ((వచ్చే వచ్చే క్రిస్మస్))
Verse:3
కష్టాలని పోగొట్టేటోడు
మృతుల సహితం లేపేటోడు ((2))
తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడు యేసు
తండ్రి అయిన దేవుడు కుమారుని పంపినాడు ((వచ్చే వచ్చే క్రిస్మస్))