Puttinadu Bala Yesudu | పుట్టినాడు బాల యేసుడు | Christian Christmas Song Lyrics Telugu - Download
పుట్టినాడు బాల యేసుడు
పల్లవి:
పుట్టినాడు బాల యేసుడు
మన కొరకు పశువుల శాలలో నంట
నీకోసమే పుట్టినాడు నా కోసమే ఉదయించినాడు
పండగే పండగే ఊరంతా పండగే
పండగే పండగే వాడంత పండగే
చరణం:
1. కానరాని కాలమందున
కన్య మరియ గర్భమందున
కరుణమయుడు వెలసినాడు
కాంతి జుపా వచ్చినాడు
2. గాబ్రియేలు దూత వచ్చే
లోకరక్షకుని వార్త చెప్పే
గొల్లలు వెళ్ళిరి యేసుని చూచిరి
జ్ఞానులు వెళ్ళిరి కానుకలిచ్చిరి
3. రాజులకు రా రాజు అండి
రాజయోగము విడచేనండి
విడిచిపెట్టెను ఆ గొప్ప భాగ్యం
భువికి వచ్చెను ప్రేమను పంచెను