వెలుగై వచ్చినాడు - విశ్వాన్నే ఏలేటోడు | VELUGAI VACHINADU Christmas Song Lyrics Telugu
వెలుగై వచ్చినాడు - విశ్వాన్నే ఏలేటోడు
"మహ రాజే మహిమను విడిచి - మట్టి మనిషిగా మారాడే
మహిలోనా వెలుగులు నింపే - మనుష్య కుమారుడె వచ్చాడే "2"
వెలుగై వచ్చినాడు - విశ్వాన్నే ఏలేటోడు
దివిలోనా కాంతులు నేడు - నిండెనంట చూడు
రక్షణ తెచ్చినాడు - రాజుల రారాజే నేడు
మిన్నంటే సంబరాలు - ప్రతి మదిలో ఎగసే నేడు
మన పాపాలు బాపంగా - దేవుడే దివికి వచ్చాడయ్యా
పరలోకానికి చేర్చంగా - మార్గమై తాను నిలిచాడయ్యా
"చీకు చింత చితికలు పేర్చి - చలి చలి మంటలు వెయ్యాలా
చిన్నా పెద్దా అంతా కలసి - చుట్టు చేరి ఆడాలా.."2"
పరలోక మహిమను నాకై - వద్దనుకున్నాడే
మట్టి ముద్దనైన నన్ను - మహిమలో చేర్చాడే
మోయలేని నా భారమును ఎత్తుకున్నాడే
ప్రాణమే పెట్టి నన్ను - హత్తుకున్నాడే
"ఆ ప్రేమే వరమై వచ్చే - నా మదిలో తారై నిలిచే
చీకట్లను చెరిపే వెలుగై - వాకిట్లో నిలిచేనే.. "2”
"చీకు చింత చితికలు పేర్చి - చలి చలి మంటలు వెయ్యాలా
చిన్నా పెద్దా అంతా కలసి - చుట్టు చేరి ఆడాలా.."2"
"మహ రాజే మహిమను విడిచి - మట్టి మనిషిగా మారాడే
మహిలోనా వెలుగులు నింపే - మనుష్య కుమారుడె వచ్చాడే "2"
పశువుల పాకలో - పవళించ దలిచాడే
రిక్తునిగా చేసికొని - తగ్గించుకున్నాడే
చీకటి నిండిన లోకంలో వెలుగై వచ్చాడే
పాపినైన నాకు - నిత్యజీవమునిచ్చాడే
"ఆ ప్రేమే యేసుగ వచ్చే.. - నా బ్రతుకులో నెమ్మదినిచ్చే
ఇమ్మానుయేలుగా నాతో ఎల్లప్పుడు నిలిచేనే.."2"
"చీకు చింత చితికలు పేర్చి - చలి చలి మంటలు వెయ్యాలా
చిన్నా పెద్దా అంతా కలసి - చుట్టు చేరి ఆడాలా.."4"