రాజుగా రారాజుగా ఏతెంచెనే బెత్లెహేములోన | raajugaa raaraajugaa Telugu Christmas Song Lyrics

రాజుగా రారాజుగా ఏతెంచెనే బెత్లెహేములోన |  raajugaa raaraajugaa Telugu Christmas Song Lyrics

రాజుగా రారాజుగా

రాజుగా రారాజుగా 

ఏతెంచెనే బెత్లెహేములోన 

రాజుగా క్రీస్తురాజుగా 

ఉదయించెనే ఈ భువిలోన 

లోకానికి శుభవార్తగా మానవాళియే పరవశింపగా (2)

నాలో నింపెను ఉల్లాసమే నాలో నిండెను ఉత్సాహమే (2)


1. నింగిలో వెలసెను తార 

   వెళ్ళిరి జ్ఞానులు చూడ (2)

   దూత సైన్యమే ఆనందభరితమై ఆర్భాటధ్వని చేసిరి (2)  ||రాజుగా||

   క్రిస్మస్ క్రిస్మస్ హ్యపి హ్యపి క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ 

    "దావీదు పురమునందు ధన్యుడేసు పుట్టెను గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి ఆరాధించె యేసును క్రీస్తు ద్వారా రక్షణ లోకానికి    వచ్చెను మన పాప శాపములు తొలగింప వచ్చెను"

2. అంధకారం తొలగించుటకు అరుదెంచెను నీతి సూర్యుడు (2)

    అక్షయ భాగ్యం అందింపవచ్చెను నిత్యజ్యోతిగా ఇలలో  (2) ||రాజుగా||