మూడు సిలువలు | Moodu Siluvalu Mositivaa | Telugu Christian Lent Song Lyrics | Bible Mission   

మూడు సిలువలు మోసితివా

    మూడు సిలువలు మోసితివా - నాకై మూడు 

    సిలువలు మోసితివా - మూడు సిలువలు మోసి - 

    మూటివలన గలుగు - కీడు సహించితివా ఆ 

    కీడును నీకాళ్ళ - క్రిందవేసి త్రొక్కి ఓడించి లేచితివా 


1. లోక పాపములను ఏకంబుగ నీ - పైకివేసికొంటివా - 

    నీకు ఆకాడి పెద్దదై - అధిక భారంబాయె - అది 

    మొదటి సిలువాయెనా (( మూడు )) 

2. లేని నేరములు నీ - పైన దుష్టులు వేయగాను 

    క్షమించితివా నీకు - ఈ నేరములుగూడ - యెంతో 

    భారంబాయె - ఇది రెండవ సిలువాయెనా (( మూడు )) 

3. కలుషాత్ములు కర్ర - సిలువ నీపై మోప - 

    అలసిపోయి యుంటివా = అట్లు అలసిపోయిన 

    మోయ - నని చెప్పకుంటివి - అది మూడవ 

    సిలువాయెనా (( మూడు ))

4. నా నేరములు యేసు - పైన వేసుకొన్న నీ 

    నెనరునకు స్తోత్రము = నీకు నేను చూపు ప్రేమ - నీ 

    ప్రాణార్పణ ప్రేమ - నిధి యెదుట ఏ మాత్రము (( మూడు )) 

5. నాఋణము తీర్చిన - నా దేవా నా ప్రభువా - నీ 

    ఋణము తీర్చ గలనా = నీవు నా ఋషివై 

    బోధించి - నా బదులు చనిపోయి - నావని 

    మరువగలనా   (( మూడు ))