ఎంత గొప్ప బొబ్బపుట్టెను | Yentha goppa bobba puttenu | Telugu Christian Lent Song Lyrics | Bible Mission
ఎంత గొప్ప బొబ్బపుట్టెను
ఎంత గొప్ప బొబ్బపుట్టెను - దానితో
రక్షణయంతయును సమాప్తమాయెను =
ఎంతగొప్ప బొబ్బ పుట్టెను - యేసునకు
గల్వరిమెట్టను - సంతసముతో సిల్వగొట్టగ -
సూర్యుడంధ కారమాయెను
1. గలిబిలి గలిగె నొకప్పుడు - శిన్యారు బాబెలు
కట్టడమును కట్టు నప్పుడు = పలుకుభాషయు -
నొక్కటైనను - పలువిదములగు భాషలాయెను -
నలుదెసలకును - జనులుపోయిరి కలువరిపై -
కలుసుకొనిరి (( ఎంత ))
2. పావనుండగు ప్రభువు మన కొరకై - యా
సిలువమీద చావునొందెడు సమయమందున -
దేవుడా నా దేవుడా నన్నేల చెయివిడిచి తివియని
యా - రావముగ మొర్రబెట్టెను యె - హోవయను
దన తండ్రితోను (( ఎంత ))
3. అందు దిమిరము క్రమ్ముగడియయ్యె - నా
నీతిసూర్యుని నంత చుట్టెను బంధకంబులు -
నిందవాయువులెన్నో వీచెను కందు యేసు
నియావరించెను - పందెముగ నొకకాటు వేసెను -
పాతసర్పము ప్రభువు యేసును (( ఎంత ))
4. సాంతమాయె నటంచు బలుకుచు - ఆ రక్షకుడు
తన స్వంత విలువగు ప్రాణమును వీడెన్ -
ఇంతలో నొక భటుడు తనదగు నీటెతో ప్రభు
ప్రక్కబొడువగ - చెంతచేరెడి పాపులను ర - క్షించు
రక్తపు ధార గారెను (( ఎంత ))