నా గానం నా ప్రాణం | Na Ganam Na Pranam | Telugu Christian Song Lyrics | Download
నా గానం నా ప్రాణం
నా గానం నా ప్రాణం
నా జీవం నా సర్వం
నీవేనయ్యా నీవే యేసయ్య "2"
నీవు లేని జీవితం ఉహించలేనయ్య
నీవు లేని ఏ స్థితిని ఆశించలేనయ్య "2"
అడగకముందే నా అక్కరలన్నిటిని
నీ కృపలోనే తీర్చినవాయ
ఆశనిరాశలలో నా తోడై నిలిచి
నా విశ్వాసమును బలపరచినావయా. "2"
ఏ దీనమైన ఏ క్షణమైనా
నీ కృపలేక మనలేనయ్యా
ఆధారమై ఆనందమై నను నడిపించావు
ఆధారమై నా ఆనందమై నను నడిపించావు
శోధన బాధలలో కృంగిన వేళలో
విడువక తోడై కాచినావయ్యా
చీకటిదారులలో నే నడచినవేళలలో
వెలుగై మార్గము చూపినావయ్యా "2"
నేనేమైన ప్రతిసమయాన
స్థితి ఏదైనా స్తుతించనా
ఆధారమై ఆనందమై నను నడిపించావు
ఆధారమై నా ఆనందమై నను నడిపించావు