మరువలేనయా నీ మధురప్రేమను | Maruvalenaya | Telugu Christian Song Lyrics | Download

మరువలేనయా నీ మధురప్రేమను | Maruvalenaya | Telugu Christian Song Lyrics

మరువలేనయా నీ మధురప్రేమను

మరువలేనయా నీ మధురప్రేమను మహోపకారి 

చింతలేదయా నీ చెంతనుండను పరోపకారి 

నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నీ రక్తమిచ్చి నన్ను కొన్నావయ్యా. 


1. నీలాగా ప్రేమించేవారెవ్వరు 

    నీలాగా క్షమియించే హృదయమేది 

    నీ కృపలో నన్ను దాచితివి 

    నీ ప్రేమలో నన్ను పెంచితివి 

    నీ వాక్యము నాలో ఉంచి (2) 

    నీ వెలుగులో నను నడిపితివి.యేసయ్యా నా యేసయ్యా ( 4) 

2. పచ్చికగల చోట పరుండజేసి 

    జీవజలపు ఊటలు నాలో ఉంచి 

    సమ్రృద్ధి జీవము నాకిచ్చితివి 

    సంతోష గానాలు పాడించితివి 

    నీ జీవము నాలో ఉంచి(2) 

    నిత్యజీవము నాకిచ్చితివి. యేసయ్యా నా యేసయ్యా (4).