నోవాహు తాత | Novahu Taatha | Telugu Christian Song Lyrics | PS.Freddy Paul | Hosanna Ministries
నోవాహు తాత నోవాహు తాత
నోవాహు తాత నోవాహు తాత
ఓడను కట్టాడు రక్షణ ఓడను కట్టాడు (2)
దేవుని చేత హెచ్చరించబడి
నీతిని ప్రకటించినాడు (2)
నీతికి వారసుడైన్నాడు
(నోవాహు తాత)
1. 300 మూరల పొడుగు ఉన్నాది
50 మూరాల వెడల్పు ఉన్నాది
30 మూరల ఎత్తు ఉన్నాది
(నోవాహు తాత)
2. మూడంతస్తులుగా కట్టబడినది
జీవరాసులకు నిలయమైనది (2)
సంతృప్తిగా ఆహారం ఉన్నది
(నోవాహు తాత)
3. ఆకాశ తూములు విప్పబడినవి
నలుబది పగళ్లు నలుబది రాత్రులు (2)
ప్రచండ వర్షము కురియుచున్నది
(నోవాహు తాత)
4. నోవాహు కుటుంబం ఓడలో చేరెను
జలప్రవాహము విస్తారమాయెను (2)
నీళ్ల మీద ఓడ నడిచెను
(నోవాహు తాత)
5. అవిధేయులందరూ చచ్చితేలిరి
విధేయులందరూ రక్షించబడిరి (2)
నూతన భూమిపై అడుగుపెట్టిరి
(నోవాహు తాత)