ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా | Prardhana cercaleni ettu unnada | Telugu Christian Song Lyrics | Download
ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా
పల్లవి:-
ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా
ప్రార్ధనతో చేరలేని లోతు ఉన్నదా "2"
ప్రార్ధనతో మార్చలేని గుండె ఉన్నదా "2"
ప్రార్ధనలో మాన్పలేని గాయమున్నదా "2"
అ'ప:-
ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి
ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది "2"
1. ఊపిరిని నిలిపింది హాగరూ ప్రార్థనే
విజయమును తెచ్చింది దెబోరా ప్రార్ధనే "2"
రాజు హృధిని మార్చింది ఎస్తేరు ప్రార్ధనే "2"
గాయములను మాన్పింది హన్నా ప్రార్ధనే "2"
ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా గురి
ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా సిరి "2"
2. బలహీనుని బలపరచే ఆమోసు ప్రార్ధనే
అగాధం నుండి లేపింది యోనా ప్రార్ధనే "2"
ఉజ్జీవం తెచ్చింది హబక్కూకు ప్రార్ధనే "2"
తండ్రి చిత్తం నెరవేర్చెను యేసయ్యా ప్రార్ధనే "2"
ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి
ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది "2"