కంటి రెప్పలా నను కాయుచున్న దేవా | Kanti Reppala | Telugu Christian Songs | Download 

Kanti Reppala | కంటి రెప్పలా నను కాయుచున్న దేవా | Telugu Christian Songs

కంటి రెప్పలా నను కాయుచున్న దేవా 

కంటి రెప్పలా నను కాయుచున్న దేవా 

అన్ని వేళలా కాపాడుచున్న దేవ 

 

నను కాచిన కాపాడిన యేసయ్య... వందనం 

వందనం వందనం యేసయ్య వందనం 

వందనం వందనం యేసయ్య వందనం... 


నా ప్రాణమునకు నెమ్మది నిచ్చావు 

నా ప్రార్థనలను ఆలకించుచున్నావు 

కృపా క్షేమమును దయచేయుచున్నావు 

కునుకక నిత్యము కాపాడుచున్నావు 


నా స్థానములో మరణించినావు 

నీ కౌగిలిలో దాచిఉంచావు 

ఊహకుమించి ఆశీర్వదించావు 

నీ సన్నిధిలో నిలబెట్టుకున్నావు