కుతూహలం ఆర్భాటమే | Kuthoohalam Aarbhaatame | Telugu Christian Song Lyrics | Download
కుతూహలం ఆర్భాటమే
ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో (2) ||కుతూహలం||
1. పాపమంత పోయెను – రోగమంత పోయెను
యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణ
పరిశుద్ధ ఆత్మలో (2) ||కుతూహలం ||
2. దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు
దేవాలయం మనమే
ఆత్మయైన దేవుడు – మన సొంతమాయెను
ఆశ్చర్యమాశ్చర్యమే (2) ||కుతూహలం||
3. శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు
జయంపై జయం ఇచ్చును
ఏకముగా కూడి – హోసన్నా పాడి
ఊరంతా చాటెదము (2) ||కుతూహలం||