నా జీవితాన కురిసెనే నీ కృపామృతం | Naa jeevithana kurisene nee | Telugu Christian Song Lyrics | Download
నా జీవితాన కురిసెనే నీ కృపామృతం
నా జీవితాన కురిసెనే నీ కృపామృతం
నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం (2)
నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను (2)
1. నీ దయ నుండి దూరము కాగా
ప్రేమతో పిలిచి పలుకరించితివే (2)
కృపయే నాకు ప్రాకారము గల – ఆశ్రయపురమాయెను
నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను (2) || నా జీవితాన ||
2. నా యేసయ్యా – నీ నామమెంతో
ఘనమైనది – కొనియాడదగినది (2)
కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను
నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది (2) || నా జీవితాన ||
3. నీ సన్నిధిని నివసించు నాకు
ఏ అపాయము దరిచేరనివ్వవు (2)
కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను
నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను (2) || నా జీవితాన ||