అత్యున్నత సింహాసనముపై | Athyunnatha Simhasanamupai | Telugu Christian Song Lyrics | Download

అత్యున్నత సింహాసనముపై | Athyunnatha Simhasanamupai | Telugu Christian Song Lyrics | Download

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా

    అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా 

    దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా 

    యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు 

    నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెద 


1. ప్రతి వసంతము నీ దయా కిరీటమే 

    ప్రకృతి కళలన్నియు నీ మహిమను వివరించునే (2) 

    ప్రభువా నిన్నే ఆరాధించెద - కృతజ్ఞతార్పణలతో  || అత్యున్నత || 


2. పరిమళించునే నా సాక్ష్య జీవితమే 

    పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2) 

    పరిశుద్దాత్మలో ఆనందిచెద - హర్ష ధ్వనులతో     || అత్యున్నత || 


3. పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే 

    నీవే నా తండ్రివైనా భాద్యతలు భరించితివే (2)

    యెహోవా నిన్నే మహిమపరచెద  స్తుతి గీతాలతో || అత్యున్నత ||