సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా | Sarvanga sundara sadguṇa | Telugu Christian Songs | Download
సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా (2)
1. నా ప్రార్థన ఆలకించువాడా
నా కన్నీరు తుడుచువాడా (2)
నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై
నాకు తోడై నిలిచితివా (2) ||సర్వాంగ||
2. నా శాపములు బాపినావా
నా ఆశ్రయ పురమైతివా (2)
నా నిందలన్నిటిలో యెహోషాపాతువై
నాకు న్యాయము తీర్చితివా (2) ||సర్వాంగ||
3. నా అక్కరలు తీర్చినావా
నీ రెక్కల నీడకు చేర్చినావా (2)
నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై
నాకు జయ ధ్వజమైతివా (2) ||సర్వాంగ||