అపరాధిని యేసయ్యా | Aparaadhini Yesayya | Telugu Christian Song Lyrics | Download
అపరాధిని యేసయ్యా
అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)
1. సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని (2)
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా (2)
2. ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే (2)
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో (2)
3. ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)
4. దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)
5. ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా (2)
6. చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా (2)
7. శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా (2)
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా (2)